కేసీఆర్ ది నాలుకా లేక తాటి మట్టా అంటూ సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇపుడు తాను అనలేదంటున్నారు. మరి దళితులకు రూ.10లక్షలు ఇస్తానంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. నాయకుడంటే మాట తప్పకూడదన్నారు. టిఆర్ఎస్ కు హుజురాబాద్ ఎన్నికలో ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను హుజురాబాద్ ఎన్నికలో గెల్పించాలన్నారు. కేసీఆర్.. రైతులు వరి వేస్తే ఉరేసుకున్నట్టేనా.. మీకు మీమంత్రులకు రైతన్నలు ఉరేస్తారన్నారు. ఎంపీ ఫండ్స్ రాకున్నా.. తాను భువనగిరిలో సొంత డబ్బుతో పనులు చేపిస్తున్నానన్నారు.
see more news