సీతక్కనే అడగండి ఎందుకు రాలేదో: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశానని ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి అన్నారు. ఉదయం గాంధీభవన్ లో  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో  కోమటిరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన ఆయన.. నియోజకవర్గ పర్యటనల వల్లే తాను ఠాక్రేను కలవలేపోయానన్నారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని చెప్పారు. పీఏసీ కమిటీలో ఆరేడు సార్లు ఓడిపోయిన వాళ్లతో తాను కూర్చోవాలా అని ప్రశ్నించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలో థాక్రేతో డిస్కస్ చేశామన్నారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు థాక్రేను కలవలేదో వాళ్లనే అడగాలన్నారు.  తన పర్సనల్ మీటింగ్ లో జరిగిన విషయాలు మీడియాకు చెప్పబోనన్నారు.  

కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటరు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని.. కాంగ్రెస్ లైన్ లోని పనిచేశారని   పీసీసీ జనరల్ సెక్రెటరీ అనిరుద్ రెడ్డి  అన్నారు.  2023 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎలా పనిచేయాలో దానిపై చర్చలు జరిగాయని చెప్పారు. దీనికి సంబంధించిన సలహాలు సూచనలు ఠాక్రే తీసుకున్నారని తెలిపారు.  ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఇష్యూ క్లియర్ అయ్యిందని చెప్పారు.