తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో ఫెయిలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రతిపక్షాలు విద్యార్థులను కనీసం పాస్ మార్కులతోనైనా పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినా.. విద్యార్థులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో స్టూడెంట్స్ సరిగా చదవకుండా పరీక్షలకు హాజరు కావడంతో ఫెయిలయ్యారు. విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంటర్ ఫెయిలయిన విద్యార్థులందరికీ వచ్చె ఎన్నికల్లో ఓటు హక్కు వస్తుందని.. వారందరూ కేసీఆర్ కు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.
గుర్తుపెట్టుకో కెసిఆర్ @TelanganaCMO & @KTRTRS ...ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వస్తుంది...వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మీకు & మీ పార్టీకి వచ్చే ఎన్నికలలో బాధిత విద్యార్థులు తగిన బుద్ధి చెప్పడం కాయం !@TSNSUI @INCTelangana
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2021
For More News..
కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్
వారంలో నాలుగు రోజులే పని