
దిల్ షుఖ్ నగర్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లోని డీడీఆర్సీ భవన్ లో వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు నిర్వహించిన అసెస్మెంట్ క్యాంప్ ను బుధవారం సరూర్ నగర్,ఆర్కే పురం కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, రాధా ధీరజ్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
మానసిక దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలు, వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం పథకాలతో ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆకుల సుజాత శ్రీధర్, నోడల్ అధికారి వి.రమేశ్, డాక్టర్స్ పాల్గొన్నారు.