హైడ్రా కింద అక్రమ నిర్మాణాలనుతొ లగించడం గొప్ప విషయమని చేవెళ్ల ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలో ఉన్నా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. తన సర్వేలో కూల్చివేతలను 78 శాతం మంది సమర్ధించారని అన్నారు. కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. హైడ్రా కూల్చివేతల వేనుక ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ నే తొలుత కూల్చేవారని చెప్పారు.
ALSO READ | హైడ్రాకు ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్
పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయ కుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిందన్నారు. హైడ్రా పనితీరుకు మద్దతు ఇస్తూనే మూడు లోపాలను, ఒక సవరణను హైడ్రా గుర్తించాలన్నారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చేపట్టిన అక్రమ నిర్మాణాల నిందితులు ఎవరో గుర్తించాలి. స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి వాటి శిథిలాల తొలగింపుకు అయ్యే ఖర్చును బిల్డర్ల నుంచే వసూలు చేయాలన్నారు.
ALSO READ |హైడ్రా దూకుడు : రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
బాధితుల్లో చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నందున వారికి పరిష్కార మార్గం హైడ్రానే చూపించాలన్నారు. ఈ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దేవాలయ భూముల విషయంలోనూ హైడ్రా ఇదే తరహాలో పని చేయాలని ప్రతిపాదించారు. మంచి చేస్తే పార్టీ లకు అతీతంగా స్వాగతిస్తామని హైడ్రాను బీజేపీకి చెందిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నామన్నారు. కొంత మంది నాయకులు తమ ఆక్రమణల విషయం వదిలేసి పక్క పార్టీలో ఉన్న నాయకులకు చెందిన నిర్మాణాలను కూల్చా లని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎస్టీఎల్, బఫర్ జోన్ లో లేదని కానీ జీవో 111 పరిధిలో ఉందన్నారు. వాటర్ చానెల్ ను పూడ్చి అక్కడ నిర్మాణం చేపట్టారని అందువల్ల దాన్ని కూల్చితే కూల్చే అవకాశాలున్నాయన్నారు.