బీజేపీని బలోపేతం చేయాలి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీని బలోపేతం చేయాలి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

గచ్చిబౌలి, వెలుగు: సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కార్యకర్తలకు సూచించారు. బంజారాహిల్స్ లోని తన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్, మాదాపూర్, కొండాపూర్ డివిజన్లకు చెందిన టీడీపీ నేతలు నల్లూరి పట్టాభి రామ్, కనికంటి ప్రభాకర్ రావు, అంకమ్మ చౌదరి, బ్రహ్మ, వెంకటేశ్​, శ్రీకాంత్, ప్రభాకర్ రెడ్డి ,సాగర్, నరసింహలు ఆదివారం బీజేపీలో చేరారు. వారికి ఎంపీ కండువా కప్పి ఆహ్వానించారు.  

ఈ కార్యక్రమంలో  నాయకులు రాధాకృష్ణ యాదవ్, ఎల్లేశ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్, జితేందర్, వంశీ రెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్ రావు పాల్గొన్నారు.