- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు : ప్రతిష్టాత్మకమైన ‘నేవి రాడార్ స్టేషన్ ప్రాజెక్టు’ కు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అనేకమందికి రానున్న రోజుల్లో తగిన ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేంద్ర రక్షణ శాఖ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగానికి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కేంద్ర- రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.