జగన్‌తోనే ఉన్నా.. ఎప్పటికీ ఉంటా: MP ఆర్.కృష్ణయ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. గురువారం రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి టాటా చెప్పడంతో పాటు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. మరి కొందరు వైసీపీ ఎంపీలు సైతం వీరి బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

Also Read :- ఇయ్యాల అతిభారీ వర్షాలు..

జగన్ నన్ను ఆదరించి.. గౌరవించారని.. మొదటి నుండి అతడికి మద్దతుగానే ఉన్నా.. ఇప్పటికీ ఉంటానని స్పష్టం చేశారు.- బీసీల కోసం కొట్లాడేందుకే జగన్ తనన రాజ్యసభకు పంపించారని.. చివరి వరకు ఇక్కడే ఉంటా.. బీసీల కోసం పోరాడుతానని అన్నారు. నా ఎజెండా ఎప్పటికీ బీసీల అభ్యున్నతేనని మరోసారి స్పష్టం  చేశారు. స్వప్రయోజనాలు, వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే వేరే పార్టీలోకి వెళ్తున్నారని పార్టీ మారిన ఎంపీలపై విమర్శలు చేశారు. పార్టీ మారొద్దని వారించిన వినలేదని.. తమకు చాలా అవసరాలు ఉన్నాయని.. అందుకే పార్టీ ఛేంజ్ అవుతున్నామని చెప్పారన్నారు. కృష్ణయ్య తాజా కామెంట్స్‎తో ఆయన పార్టీ మార్పు వార్తలకు ఎండ్ కార్డ్ పడింది.