బీజేపీ నేషనల్ రిటర్నింగ్ అధికారిగా ఎంపీ లక్ష్మణ్

బీజేపీ నేషనల్ రిటర్నింగ్ అధికారిగా ఎంపీ లక్ష్మణ్
  • మరో ముగ్గురికి కో-రిటర్నింగ్ బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ నడ్డా

న్యూఢిల్లీ, వెలుగు:బీజేపీ సం స్థాగత ఎన్నికల నిర్వహణ కోసం ఆ పార్టీ నేష నల్ ఎగ్జిక్యూటివ్ కమి టీతో పాటు పార్టీ చీఫ్ జేపీ నడ్డా రిటర్నింగ్, కో– రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ఇందులో నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పార్టీ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయ రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు.. నేషనల్ కో-రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఎంపీలు నరేశ్ బన్సల్, సంబిత్ పాత్రా, పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రేఖా వర్మ పేర్లను ప్రకటించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ ఆదేశాలను పార్టీ నేషనల్ బేరర్స్, స్టేట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్, స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)లకు సమాచారం ఇచ్చారు. కాగా, ఎంపీ లక్ష్మణ్​ను మంగళవారం ఆ పార్టీ ఓబీసీ మోర్చా నేషనల్​ సోషల్​ మీడియా సభ్యుడు పెరిక సురేశ్​ సన్మానించారు.