ఎర్రవల్లిలో 100 ఇండ్లు కట్టి 8ఏండ్లుగా అవే చూపిస్తుండు : లక్ష్మణ్

మునుగోడు ఉప ఎన్నిక కోసం తెలంగాణ మొత్తం చూస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్లు కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. మునుగోడు ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన... టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దద్దమ్మ అనే మునుగోడును దత్తత తీసుకుంటున్నావా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఎర్రవల్లిలో వంద ఇండ్లు కట్టి 8ఏండ్లుగా అవే చూపిస్తున్నడని లక్ష్మణ్ విమర్శించారు.

దళితులను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్కు లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉప ఎన్నిక వచ్చినందునే ఎస్టీ రిజర్వేషన్లు ప్రకటించారని మండిపడ్డారు. నిధులు మోడీ ప్రభుత్వానివి సోకు కేసీఆర్ది అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అన్నారు. డొక్కు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ కు ఇంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేశానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరికి ఎంత మొత్తం చేశారో చెప్పాలని నిలదీశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.