టీఆర్ఎస్ లో తండ్రీ కొడుకులు మాత్రమే అధ్యక్షులైతరు : లక్ష్మణ్ 

అత్యంత వెనుకబడిన వర్గాలు రాజకీయంగా  అత్యున్నత స్థానాలకు ఎదగడమనేది బీజేపీలోనే సాధ్యమవుతుందని ఎంపీ , పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ లో వెనుకబడిన వర్గాల వారు అధ్యక్షులు కాలేరని..  తండ్రీ కొడుకులు మాత్రమే అధ్యక్షులవుతారని చెప్పారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగారెడ్డిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

మునుగోడులో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించొచ్చని తెలిపారు. ఉపఎన్నికల్లో బీజేపీకి ఓటువేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ‘‘ గొర్రెల పంపిణీ పేరుతో గొల్ల కురుమలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. గొర్రెల పంపిణీ నగదును ఇంకా ఎందుకు బదిలీ చేయడం లేదు’’ అని  లక్ష్మణ్  ప్రశ్నించారు.