న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్న తెలం గాణ గిరిజనులకు న్యాయం చేయాలని కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాను కోరారు. కాం గ్రెస్, బీజేపీకి దూరంగా ఉంటామని చెప్తున్న బీఆర్ఎస్ ఎంపీలు.. కాంగ్రెస్ వాకౌట్ చేయగానే వాళ్లతో కలిసి వెళ్లిపోయారని విమర్శించారు.
ALSO READ :గిరిజనులకు విద్య, వైద్యం అందించాలి: ఆర్ కృష్ణయ్య
మంగళవారం రాజ్యసభలో కేంద్రం తెచ్చిన ఎస్టీ రాజ్యాంగ ఐదో సవరణ బిల్లుపై లక్ష్మణ్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వాల్మీకి, బోయ, వడ్డెర కులాలు ఏండ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయని సభ దృష్టికి తెచ్చారు. గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, ప్రస్తుత తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడూ ఈ కులాల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.