హామీలు నెరవేర్చకుంటే అధికారం నుంచి తప్పుకోండి : ఎంపీ లక్ష్మణ్

హామీలు నెరవేర్చకుంటే అధికారం నుంచి తప్పుకోండి : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలకు క్షమాపణలు చెప్పి అధికారం నుంచి తప్పుకోవాలని ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలంటూ హామీలు ఇచ్చిందని, ఏడాదైనా అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తున్నారు. 

ఆ పార్టీ వైఫల్యానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు. హామీలు అమలు చేసేదాకా వెంటాడుతాం. ఆ పార్టీ నేతలను అడ్డుకుని నిలదీస్తాం. ఆరు గ్యారంటీలపై రాహుల్ గాంధీ స్పందించాలి. తెలంగాణతో పాటు కర్నాటక, హిమాచల్​ప్రదేశ్​లోనూ ఇదే పరిస్థితి ఉన్నది’’అని లక్ష్మణ్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటేయాలని కోరారు.