గండీడ్, వెలుగు: మండల సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడం సరైంది కాదని, మీటింగ్ అనగానే జరం వచ్చిందని సాకులు చెబుతున్నారని ఎంపీపీ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని, సాకులు చెబుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే సర్వ సభ్య సమావేశంలోగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీఈశ్వరయ్య గౌడ్, ఎంపీడీవో రుపేందర్ రెడ్డి, తహసీల్దార్లు జ్యోతి, ఆంజనేయులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే వచ్చిన ఆఫీసర్లు సైతం సెల్ఫోన్లలో బిజీగా ఉండడంపై సర్పంచులు, ఎంపీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.