అస్తిత్వం కోసమే కాంగ్రెస్​పై కేసీఆర్ విమర్శలు : ఎంపీ మల్లు రవి

అస్తిత్వం కోసమే కాంగ్రెస్​పై కేసీఆర్ విమర్శలు : ఎంపీ మల్లు రవి
  • ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వం కోసం, ఆ పార్టీని నాయకులు విడిచి వెళ్లకుండా ఉండేందుకే కాంగ్రెస్​పై కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తుండని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఆరు నెలలుగా ఫామ్ హౌస్​లో ఉండి, బుధవారం తెలంగాణ భవన్​కు వచ్చి ఉప ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ ఓడిపోతుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తుండని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో తక్కువగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాడనే కేసీఆర్ విమర్శలను ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు.