- పలు రాష్ట్రాలకు కన్వీనర్లను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని అధిష్టానం నియమిచింది. ఈ మేరకు శుక్రవారం సీపీపీ సెక్రటరీ అమర్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని 25 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 11 మంది లోక్‌సభ/రాజ్యసభ సభ్యులకు కన్వీనర్లుగా బాధ్యతలు అప్పగించింది.
కేరళ, లక్ష్యదీప్ కన్వీనర్‌గా ఆంటోనీ, తమిళనాడు, పుదుచ్చేరికి జోతిమణి, కర్నాటకకు సి.చంద్రశేఖర్, మహారాష్ట్ర, గోవాకు ప్రణితి షిండే, రాజస్థాన్, గుజరాత్‌కు బ్రిజేంద్ర, హర్యానాకు వరుణ్ చౌధరి, పంజాబ్, చంఢీగర్,జమ్మూ కాశ్మీర్‌కు గుర్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు ఇమ్రాన్ మసూద్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు సుఖ్ దేవో భగత్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌కు రకిబుల్ హుస్సేన్‌ను అధిష్టానం నియమించింది. కాగా, తెలంగాణ కన్వీనర్‌గా నియమితులైన మల్లు రవికి ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు అభినందనలు తెలిపారు.