ఐటీఐ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు: మల్లు రవి

ఐటీఐ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు: మల్లు రవి
  • మప్రతిపాదనుందా? ..లోక్​సభలో ఎంపీ మల్లు రవి ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టే ఆలోచన కేంద్రానికి ఉందా ? అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. సోమవారం ఆయన లోక్ సభ క్వశ్చన్ అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు దిశలో ప్రస్తుతం కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ను తయారు చేస్తోందని చెప్పారు.

తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ కోసం నిధుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి జయంత్ చౌదరి స్పందిస్తూ..ఈ బడ్జెట్ లో తెలంగాణలోని ఐటీఐలకు నిధులు అందినట్లు చెప్పారు. ఐటీఐల కోసం బడ్జెట్ లో రూ. 60 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.