న్యూఢిల్లీ, వెలుగు: రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు కలెక్టర్‌పై దాడి చేశారని ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారం ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ప్రజలను బీఆర్ ఎస్ పార్టీ రెచ్చగొడుతోందని మండి పడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని భ్రమ కల్పించే ఉద్దేశంతోనే కొడంగల్ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు.