బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయ్‌‌‌‌‌‌‌‌ : ఎంపీ మల్లు రవి

బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయ్‌‌‌‌‌‌‌‌ :  ఎంపీ మల్లు రవి
  • ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందం మళ్లీ బయటపడింది:  ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అంతర్గతంగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీలో లేకుండానే ఆ పార్టీ ఓట్లను బీజేపీకి బదలాయించిందని ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసులను బూచిగా చూపెట్టి బీజేపీ భయపెట్టిందని, అందుకే రహస్య ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుదిరిన చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. 

కేవలం రెండు ఎమ్మెల్సీ సీట్లు సాధించగానే.. రాబోయే అన్ని ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 100 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.