ప్రజల తిరుగుబాటుతోనే మీకు ఈ గతి..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంపీ మల్లు రవి ఫైర్

ప్రజల తిరుగుబాటుతోనే మీకు ఈ గతి..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంపీ మల్లు రవి ఫైర్

హైదరాబాద్, వెలుగు: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజలు తిరగబడినట్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తిరుగుబాటుకు తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో మీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇక్కడి ప్రజలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు కూల్చిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారని, ఇక కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిత్యం జోకర్లలా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వకుండా ఫేక్ లెటర్ సృష్టించి సోషల్ మీడియాలో కేటీఆర్ వైరల్ చేస్తున్నారని మల్లు రవి ఆరోపించారు.