కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ మల్లు రవి

కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ మల్లు రవి

గద్వాల, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాకు విమానాశ్రయం మంజూరు చేయాలని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి కోరారు. సోమవారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. 

అనంతరం వ్యవసాయం, ఉద్యానవన, పశువైద్య విశ్వవిద్యాలయాల నిధుల గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చించారు. 50 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వివిధ సమస్యలపై చర్చించారు.