హైదరాబాద్​కు కంపెనీలు రాకుండా బీఆర్ఎస్​ కుట్ర: ఎంపీ మల్లురవి

హైదరాబాద్​కు కంపెనీలు రాకుండా బీఆర్ఎస్​ కుట్ర: ఎంపీ మల్లురవి
  • పోలీసులపై దాడి చేసుడేంది: ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు,పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్​ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ  మల్లు రవి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉంటే ప్రశ్నించాలి కానీ, పోలీసులపై దాడి చేయడం ఏమిటని ఆయన మండిపడ్డారు. 

బీఆర్ఎస్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్టు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్​ నాయకులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వారు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని ఫైర్​అయ్యారు. 

బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. వాళ్ల హయాంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇవ్వలేదా? అని ఆయన ప్రశ్నించారు.