నేరం చేస్తే జైలులో వేసి ఎందుకు శిక్షిస్తారంటే తాను చేసిన తప్పు తెలుసుకోని మారతాడనే ఉద్ధేశ్యంతో.. కానీ ఓ వ్యక్తి జైలులో ప్రింటింగ్ టెక్నిక్స్ నేర్చుకొని బయటకు వచ్చి దొంగనోట్లు ముద్రించసాగాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. భూపేంద్ర సింగ్ ధాకత్ క్రిమినల్ రికార్డ్ ఉన్న ఓ నేరగాడు. ఒక హత్యతో పాటు అతనిపై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేరం రుజువై విదిశ జైలులో శిక్ష విధించారు. అక్కడ ఖైదీలకు సత్ర్పవర్తణ రావడానికి, జైలు నుంచి విడుదలైయ్యాక కష్టపడి పని చేసుకోవడానికి కొన్ని పనుల్లో శిక్షణ ఇస్తారు. దొంగతనాలు, నేరాలకు మళ్లీ పాల్పడకూడదని ప్రింటింగ్, హస్త కళలు, బీడీలు చుట్టడం, నేత పని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ తయారు చేయడం వంటి పనుల్లో ట్రెనింగ్ ఇస్తారు.
అలా భూపేంద్ర సింగ్ ధాకత్ విదిశ జైలులో ఆఫ్ సెట్ ప్రింటింగ్, స్కీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక జైలులో నేర్చుకున్న ప్రింటింగ్ టెక్నిక్స్ తో దొంగనోట్లు ప్రింటింగ్ చేశాడు. అతన్ని పోలీసులు పట్టుకొని మళ్లీ అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయడం విదిశ జైలులో నేర్చుకున్నానని ఓప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి 95 రూ.200 ల నోట్లు, కలర్ ప్రింటర్, ఆరు ఇంక్ బాటిళ్లు, ఫేక్ కరెన్సీ తయారీ వాడే పేపర్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.