వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూన్ల్ 30వ తేదీ ఆదివారం రోజున మిథున్‌ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఈ పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే  ముందస్తూ సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  మిథున్ రెడ్డి హౌస్‌ అరెస్టు నేపధ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గొడవ జరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసీసీ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మిథున్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న నేతలు, కార్యకర్తలను సైతం అనుమతించడంలేదు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను కూడా తనను కలవనీయడం లేదని మండిపడ్డారు.  దీనిపై తాను లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు మిథున్ రెడ్డి.