భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వచ్చే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లాలోని కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో ఎంపీ నామా శనివారం పర్యటించారు. చుంచుపల్లి మండలంలోని ఎన్కే నగర్లోని బీఆర్ఎస్ నేత బిక్కసాని నాగేశ్వరరావు సోదరి భాగ్యమ్మ ఇటీవల మృతి చెందారు.
వారి కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. కొత్తగూడెంలోని ఎంజీ రోడ్లో గల డాక్టర్కృష్ణ ప్రసాద్, డాక్టర్ సుబ్బారావుల తల్లి ఇటీవల మృతి చెందడంతో వారిని పరామర్శించారు. మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోపలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఎంపీపీ బదావత్ శాంతి, నాయకులు లగడ పాటి రమేశ్, కొట్టి వెంకటేశ్వర్లు, కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగన్, తదితరులు పాల్గొన్నారు.