గ్యారంటీల పేరుతో వచ్చే  వారికి గ్యారంటీ లేదు

వైరా, వెలుగు :  గ్యారంటీ పేరుతో వచ్చే వారికి గ్యారంటీ లేదని, వారి మాటలు ప్రజలు నమ్మబోరని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొణిజర్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మంగపురంలో మండల అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే రాములు నాయక్, వైరా నియోజకవర్గం బీఆర్ యస్ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్, జిల్లా రైతు సమన్వ కమిటీ జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ ప్రజలకు మరింత చేరువలొ మేనిఫెస్టో కేసీఆర్ ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీకి అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదని, ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా వైరాలో మదన్ లాల్ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పొట్ల కవిత,చల్లా మోహన్ రావు, కిలారి కిరణ్, చెరుకుమల్లి రవి, పాములు వెంకటేశ్వర్లు, జడల మల్లేశ్, ఏలూరి శ్రీనివాస్ రావు, డెరంగుల బ్రహ్మం ఉన్నారు.