రైతు ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించండి : నామా నాగేశ్వరరావు

అశ్వారావుపేట, వెలుగు : బీఆర్​ఎస్​ రైతు ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. మంగళవారం అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పథకం పెట్టి రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజల బాగోగులు గురించి ఏనాడు మాట్లాడని రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

సభను సక్సెస్​ చేయాలి 

దమ్మపేట : ఈనెల 13న అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభను సక్సెస్​ చేయాలని ఎంపీ నామా కోరారు. మంగళవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించిన ఎంపీ ముందుగా సభా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చాతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.