కాస్త వెయిట్​ చేయండి

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణలో మద్యానికి మద్యం.. పాలకు పాలు తేలిపోతాయని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అన్నారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో మరో ఎంపీ సుధాన్షు  త్రివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాంలో తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత డిమాండ్ పై ఎంపీ స్పందించారు. కవిత దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు ఇంకా అందలేదని, అవి అందగానే స్పందిస్తానని చెప్పారు. ‘‘కాస్త వెయిట్​ చేయండి.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో మేం ఎవరిపై ఆరోపణలు చేశామో.. వారికి సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి” అని పర్వేశ్ చెప్పారు.