రెండు బస్తాల చిల్లర ఇచ్చాడు.. మాజీ భార్యను పండగ చేసుకోమన్నాడు..

రెండు బస్తాల చిల్లర ఇచ్చాడు.. మాజీ భార్యను పండగ చేసుకోమన్నాడు..

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో  ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన సొమ్మును డిపాజిట్ చేసిన మొత్తాన్ని లెక్కించి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ బిజీగా ఉండే గ్వాలియర్ పోలీసులను కలవరపరిచే ఘటన చోటు చేసుకుంది.  నేరస్థులను పట్టుకోవడం.. నేరాలను అరికట్టడంలో బిజీగా ఉంటే పోలీసులు  రెండు బస్తాల నాణేలను లెక్కించారు.  

గ్వాలియర్ లోని  ఒక స్వీట్ షాప్ యజమానికి అతని భార్యకు గొడవలు జరిగాయి. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. .ఈ కేసును  విచారణ జరిపిన  కుటుంబ న్యాయస్థానం ప్రతినెలా భార్యకు భరణంగా రూ.5వేలు చెల్లించాలని భర్తను (స్వీట్ షాప్ యజమానిని) ఆదేశించింది.  అయితే ఎనిమిది  నెలలుగా భర్త ఈ మొత్తాన్ని భార్యకు ఇవ్వడం లేదు.   కోర్టు నిర్ణయాన్ని భర్త పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన భార్య మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఈసారి, కోర్టు జోక్యం చేసుకుని మెయింటెనెన్స్ ఛార్జీని అమలు చేయాలని...  అతని భార్యకు...   భర్త నుండి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల ప్రకారం  పోలీసులు, మెయింటెనెన్స్ ఛార్జీని చెల్లించాలని  స్వీట్ షాప్ యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అప్పుడు రెండు  బ్యాగుల నాణేలతో  పోలీస్ స్టేషన్ లో కనిపించాడు.   ఆ వ్యక్తి తీసుకువచ్చిన  నాణేలను లెక్కించడానికి పోలీసులు చాలా కష్ట పడ్డారు.  అయినా  పోలీసులు పట్టుదలతో పట్టుదలతో నాణేలను లెక్కించారు. ఆ వ్యక్తి 20 వేల రూపాయల నాణేలను, అదనంగా మరో 10 వేల రూపాయలను 10 రూపాయల నోట్ల రూపంలో తీసుకొచ్చాడు. మొత్తానికి ఖాతా జమ అయిన తర్వాత, కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకులో జమ చేశారు.  

డిజిటల్ చెల్లింపుల యుగంలో ఈ విచిత్రమైన కేసు మరింత ప్రబలంగా మారింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడాన్ని ప్రోత్సహిస్తూ డిజిటల్ చెల్లింపు పద్ధతులను అనుసరించడాన్ని ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహించింది.  నాణేలతో నిండిన బ్యాగులతో ఒక వ్యక్తి పోలీసు స్టేషన్‌కు రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.