వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి

చండ్రుగొండ/పాల్వంచ రూరల్/కల్లూరు, వెలుగు: ఎవరూ అధైర్య పడొద్దని, వచ్చేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన కల్లూరు టౌన్, పాల్వంచ మండలం దంతెలబొర ఎస్సీ కాలనీ, గంగదేవిగుప్ప గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్లు ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని, రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఆయన వెంట పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గద్దల రమేశ్​ఉన్నారు. అంతకు ముందు పొంగులేటి కల్లూరులో భారీ టూవీలర్​ర్యాలీ నిర్వహించారు. కల్లూరు నుంచి జీడీబీ పల్లి, వాచానాయక్ తండా, లింగాల, చెన్నూరు, పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే తిప్పనపల్లి పంచాయతీ శివారు మహ్మద్ నగర్ లో జ్వరాల బారిన పడ్డ కుటుంబాలకు పొంగులేటి వర్గీయులు నిత్యావసరాలు పంపిణీ చేశారు.