ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

 

  • నిర్వాసితుల జీవితాలతో చెలగాటాలా?
  • రాజీకీయ ఒత్తిళ్లతోనే  మహాధర్నాను అడ్డుకుంటున్నరు
  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: మిడ్ మానేర్ భూనిర్వాసితుల జీవితాలతో బీజేపీ, టీఆర్ఎస్ చెలగాటమాడుతున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శనివారం స్థానిక డీసీసీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణతో కలిసి పొన్నం మాట్లాడారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ముంపు గ్రామాల ఐక్య వేదిక, కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేములవాడ నందిచౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పోలీసులు అనుమతిని రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. జూన్ 18, 2017న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరేందుకే  ధర్నా చేపట్టామని, ఎమ్మెల్యే రమేశ్​బాబు, మంత్రి కేటీఆర్ సూచనలతోనే అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. పాదయాత్ర చేసైనా భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తానని చెప్పిన ఎంపీ బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఎంపీకి దమ్ముంటే మహా ధర్నాకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, నాగుల సత్యనారాయణ, భూనిర్వాసితుల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. 

కేసులను త్వరగా పరిష్కరించాలి
 హైకోర్టు జడ్జి సంతోష్ రెడ్డి

సిరిసిల్ల కలెక్టరేట్, వేములవాడ, వెలుగు: జిల్లాలోని పెండింగ్ కేసులను ఫాస్ట్ గా పరిష్కరించాలని హై కోర్టు జడ్జి ఎ.సంతోష్ రెడ్డి న్యాయమూర్తులకు సూచించారు. శనివారం ఆయన సిరిసిల్ల, వేములవాడ కోర్టును విజిట్ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తులతో మాట్లాడారు. తాను లా కార్యదర్శిగా ఉన్న టైమ్​లో 50 కోర్టులు మంజూరు చేశానన్నారు.  అనంతరం సిరిసిల్ల కోర్టు ఓల్డ్ బిల్డింగ్ ను పరిశీలించారు. అనంతర జడ్జిని బార్ అసోసియేషన్ ను సభ్యులు సన్మానించారు. జడ్జి వెంట జిల్లా న్యాయమూర్తి  ప్రేమలత, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రవీందర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి ప్రతీక్ సిహాగ్, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఎస్పీ  రాహుల్ హెగ్డే ఉన్నారు. 

కొత్తగా 31,822 ఆసరా పింఛన్లు 
పేద ప్రజల అభివృద్దే ధ్యేయం
బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్

కరీంనగర్​ రూరల్, టౌన్, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 15 వేల పెన్షనర్లు ఉండగా కొత్తగా 31,822 మందికి పింఛన్లు మంజూరు చేశామని బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ టీవీ గార్డెన్స్ లో బొమ్మకల్, గోపాల్ పూర్, దుర్శేడ్ గ్రామాలకు చెందిన 596 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్​కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధే  ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  
సీఎం  సభను  విజయవంతం చేద్దాం 

ఈనెల 29న పెద్దపల్లిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేద్దామని మంత్రి అన్నారు. స్థానిక మీసేవ ఆఫీస్ లో మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని, అందుకోసం నియోజకవర్గం తరఫున బహిరంగ సభను విజయవంతం చేసి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.  ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో పీడీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

బాధితుల డబ్బులు వెంటనే ఇప్పించాలి

గోదావరి ఖని, వెలుగు : ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును వారికి ఇప్పించేలా మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యత తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ గోనె ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, గుమ్మడి కుమారస్వామి కోరారు. శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ పెద్దపల్లి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబానికి పరిహారంతోపాటు, ఆయన భార్యకు మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఉద్యోగం ఇప్పించాలన్నారు. కాగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కొట్లాడి దళారుల నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. అలాగే గోదావరిఖనిలో ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూ లీడర్లు కృష్ణ, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వసూళ్ల దందాపై సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జిచేత విచారణ జరిపించాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ నారాయణరావు, మాదన కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితులకు అండగా ఉంటా
రామగుండం ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితులకు అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో130 మంది బాధితులు ఆయనను కలవడంతో వివరాలను నోట్ చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన దళారులు ఏ పార్టీవారైనా, మిత్రులైనా, బంధువులైనా వదిలేది లేదని అన్నారు. వారి డబ్బులు వెంటనే చెల్లించాలని లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఫిక్స్ డ్​ డిపాజిట్ పేరిట 
మోసం చేశారని ఆందోళన

జగిత్యాల, వెలుగు: స్థానిక గోవింద్ పల్లి యూనిక్ మార్కటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ లో ఫిక్స్ డ్​ డిపాజిట్ చేసిన డిపాజిటర్లు శనివారం ఆందోళన కు దిగారు. కాల పరిమితి ముగిసిన డిపాజిట్లు రెండేళ్లు గడిచినా ఇవ్వకపోగా, ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. డిపాజిటర్ శంకరవ్వ రూ.1.50 లక్షలు, లింగయ్యకు రూ.50 వేలు, సురేశ్​రూ.1.50 వేలు, పవన్ కుమార్ రూ.50 వేలు డిపాజిట్ చేసి సమయం ముగుసినా ఇవ్వకపోవడంతో వారు సిబ్బందిని ఆఫీస్ లో నిర్బంధించారు. దీంతో నెలలోపు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తానని బ్యాంక్ సిబ్బంది హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.