న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోడీ చేసిన సుధీర్ఘ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. ఆదివారం (డిసెంబర్ 15) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభలో మోడీ 110 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగాన్ని ‘డబుల్ పీరియడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ అని అభివర్ణించారు.
ప్రధాని మోడీ స్పీచ్ విసుగు తెప్పించందన్నారు. ‘‘రాజ్యాంగంపై చర్చ సందర్భంగ మోడీ కొత్తగా ఒక్క మాట మాట్లాడలేదు.. ఆయన స్పీచ్ నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. సభలో మోడీ ప్రసంగిస్తున్నంత సేపు నేను స్కూళ్లో మ్యాథ్స్ డబుల్ పీరియడ్లో కూర్చుకున్నట్లు అనిపించింది’ అని మోడీ స్పీచ్పై ప్రియాంక తనదైన శైలీలో ఛలోక్తులు విసిరారు. మోడీ మాట్లాడుతుంటే నడ్డా చేతులు దులుపుకున్నారు..కానీ మోడీ అతని వైపు చూడగానే నడ్డా ప్రధాని ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్నట్లు నటించాడని ఎద్దేవా చేశారు.
ALSO READ | ఆప్ ఫైనల్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్ పోటీ చేసేది ఎక్కడనుంచంటే..?
హోం మంత్రి అమిత్ షా కూడా మోడీ మాట్లాడుతంటే తలపై చేయి వేసుకున్నాడని.. పీయూష్ గోయల్ నిద్రపోయాడని అన్నారు. పార్లమెంట్ కు వెళ్లడం నాకు ఇదే ఫస్ట్ టైమ్.. ప్రధానమంత్రి ఏదైనా మంచిగా, కొత్తగా చెబుతారని అనుకున్నా.. కానీ ఆయన ప్రసంగంలో కొత్తదనమేమి లేదని బోర్ తెప్పించిందని ప్రియాంక ఎద్దేవా చేశారు. మోడీ చేసిన 11 తీర్మానాలను బొమ్మలుగా అభవర్ణించారు. అదానీ అవినీతి చేయకపోతే.. అదానీ అంశంపై సభలో చర్చకు బీజేపీ ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించారు.
కాగా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగ లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. మొత్తం రెండు రోజుల పాటు రాజ్యాంగంపై చర్చ జరగగా.. సభ్యులు మాట్లాడారు. రాజ్యాంగంపై చర్చ ముగిసిన అనంతరం లోక్ సభా పక్ష నేత, ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మోడీ కాంగ్రెస్ పార్టీ విరుచుపడ్డారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని చంపేసిందని.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిందని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీస్తూ ఎమర్జెన్సీ విధించారని.. కాంగ్రెస్ పాలనకు ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ అని విమర్శించారు. దాదాపు 110 నిమిషాలకు పైగా ప్రసంగించిన మోడీ.. కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.