రిజర్వేషన్లు పెంచకపోతే ఎన్నికలు జరగనివ్వం: ఎంపీ ఆర్.కృష్ణయ్య

రిజర్వేషన్లు పెంచకపోతే ఎన్నికలు జరగనివ్వం:  ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు. జూన్​నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే ప్రకటించారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎంకు లెటర్​రాశారు. బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని హెచ్చరించారు. 2019లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడంతో, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.