మెదక్ లో రూ.200 కోట్లు పంపిణీ చేశారు : రఘునందన్ రావు

మెదక్ లో రూ.200 కోట్లు పంపిణీ చేశారు : రఘునందన్ రావు

మెదక్ పార్లమెంట్ ఎన్నికలో విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేశారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఓటర్లకు డబ్బులు పంచిపెంట్టారని ఆరోపించారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 వందల కోట్ల రూపాయలు పంపిణీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులు పంపిణీ చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎంపీగా గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు.

మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39 వేల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా .. అధికార కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధు రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీఆర్ఎస్​సిట్టింగ్​ స్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది.