ఐదు తరాలుగా అంబేద్కర్​ ను అవమానిస్తున్న కాంగ్రెస్ : ఎంపీ రఘునందన్ రావు

ఐదు తరాలుగా అంబేద్కర్​ ను అవమానిస్తున్న కాంగ్రెస్ : ఎంపీ రఘునందన్ రావు

సంగారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్ ​ఐదు తరాలుగా అంబేద్కర్​ని అవమానిస్తూనే ఉందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలోని బీజేపీ పార్టీ జిల్లా ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తులే నేడు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపునివ్వడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రైతు భరోసా నిరసనలు కేవలం  రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నారని విమర్శించారు. 

పదేండ్లు అధికారంలో ఉండి పరిష్కరించలేని వ్యక్తులు నేడు ఆర్భాటం చేయడం కేవలం రాజకీయం కోసమేన్నారు. పసుపు బోర్డుపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను తప్పుబడుతూ తీహార్ జైలు నుంచి వచ్చాక ఆరోగ్యం సరిగా లేదని, ఆవిడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి మొదటి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి, నేతలు జగన్, సంగమేశ్వర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.