
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద నాన్ స్టాప్ గా దాడి చేస్తోంటే.. బీజేపీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై దుమ్మెత్తి పోస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.హెచ్ సీయూలో రోడ్డు వేసినప్పుడు బావబామ్మర్ది ఎక్కడికి పోయారంటూ మండిపడ్డారు రఘునందన్ రావు.
దొంగనే దొంగ అన్నట్టుగా బిఆర్ఏస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు.ములుగులో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ కి భూమి పహానిలో కేటాయించారని..కానీ 1974 లో ఇచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ భూములు హెచ్ సీయూ పేరున కేటాయించలేదని అన్నారు.
ఫాల్త్ గళ్ళు మీడియా ముందుకు వచ్చి మేము భూములను కాపాడే ప్రయత్నం చేశాము అంటున్నారని..కెసిఆర్ సీఎం ఆఫీస్ కూడా రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మార్చారని మండిపడ్డారు. భూములను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అన్నారు రఘునందన్ రావు.