అక్రమ పట్టా పాస్​ పుస్తకాలను రద్దుచేయాలి : ఎంపీ రఘునందన్ రావు

అక్రమ పట్టా పాస్​ పుస్తకాలను రద్దుచేయాలి : ఎంపీ రఘునందన్ రావు
  • కలెక్టర్ ను కోరిన ఎంపీ రఘునందన్ రావు

సంగారెడ్డి టౌన్, వెలుగు : రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పరిధిలోని భూమికి సంబంధించి అక్రమ పట్టాపాస్ పుస్తకాలను రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని ఎంపీ రఘునందన్​రావు కలెక్టర్​క్రాంతిని కోరారు. సోమవారం గిరిజనులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80 కుటుంబాలు ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారని, 1994లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు గిరిజనులకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశాలు ఇచ్చిందన్నారు.

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులను కాదని స్థానికేతరులైన భూస్వాములకు డిసెంబర్ 21న కొత్త సర్వే నంబర్లను సృష్టించి అక్రమ పట్టా పాస్ బుక్ లను జారీ చేశారన్నారు. ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్న వెలిమల తండ, కొండకల్ గిరిజనులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బాధిత గిరిజన రైతులు, బీజేపీ నాయకులు కొండాపురం జగన్ ఉన్నారు.