BRS నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతరు: ఎంపీ రఘునందన్ రావు

BRS నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతరు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‎లోకి వచ్చిన 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతారని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పక్క పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నాడని అన్నారు. ఆదివారం (మార్చి 2) హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పాలన పడకేసిందని.. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు.

 ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి సంబంధం లేని అంశాల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రులు తన మాట వినడం లేదని స్వయంగా సీఎం రేవంతే చెప్పారన్నారు. బీసీల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారని అన్నారు. మామునూర్ ఎయిర్ పోర్టుతో కాంగ్రెస్‎కు సంబంధమే లేదని.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ కృషితోనే వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చిందని తెలిపారు. 

Also Read : ఉగాది నుంచి గద్దర్ అవార్డులు

సీఎం రేవంత్ కు అసలు పరిపాలన పట్టుందా..? సీఎం కుర్చీ కాపాడుకోవడానికి  ఆయనకు ఢిల్లీ టూర్లే సరిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి.. సీఎం రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదని.. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి కిషన్ రెడ్డి.. పదవుల కోసం తిట్టిన పార్టీలోనే  చేరిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని సెటైర్ వేశారు. ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాతనా సీఎం ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటన స్థలానికి వెళ్లేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలులు అవుతోన్న ఇంతవరకు కేబినెట్ విస్తరణ ఎందుకు చేయలేదని నిలదీశారు. సీఎం రేవంత్  పాలన నీరో చక్రవర్తిలా ఉందని మండిపడ్డారు. వాటా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వా్ల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. త్రిభాష సిద్ధాంతం వద్దని రేవంత్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.