నీ ఫాంహౌజ్ కాకుంటే..రేవంత్రెడ్డిపై కేసు ఎలా పెట్టావ్ కేటీఆర్: ఎంపీ రఘునందనరావు

హైదరాబాద్: బీఆర్ ఎస్ నేత కేటీఆర్ పై ఎంపీ రఘనందన్ రావు సెటైర్లువేశారు. జన్వాడ ఫాం హౌజ్ నాది కాదని చెబుతున్నాము.. నీది కాకుంటే కేసు ఎందుకు పెట్టా వని ప్రశ్నించారు. జన్వాడ ఫాం హౌజ్ కేటీఆర్ ది కాకపోతే.. గతంలో డ్రోన్ ఎగరవేసినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు పంపారని నిలదీశారు. 

మరో బీఆర్ ఎస్ నేత హరీష్రావు చేస్తున్న ఆలయాలయాత్రపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పదవిపోతే గానీ హరీష్ రావుకు దేవుడు గుర్తుకు వచ్చాడా అని అన్నారు. బండి సంజయ్ యాదగిరి గుట్ట నరసింహ స్వామి మీద ప్రమాణం చేద్దాం రా అన్నప్పుడు హరీష్ రావు దుప్పటి కప్పుకుని పడుకున్నారని అన్ని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్  రావు.