
రామచంద్రాపురం, వెలుగు: పోస్ట్ ఆఫీస్సేవలను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో పోస్ట్ఆఫీస్ను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్‌లోని విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పోస్ట్ఆఫీస్ కావాలని కోరారన్నారు. అందుకే తెల్లాపూర్‌లో బ్రాంచ్ ఏర్పాటు కోసం అధికారులతో మాట్లాడానని పేర్కొన్నారు.
తెల్లాపూర్ వంద ఫీట్ల రోడ్ నుంచి ఎంఐజీ వైపు బ్రిడ్జి ఏర్పాటును త్వరలోనే పూర్తి చేస్తామని, రైల్వే అండర్ పాస్ విస్తరణ తొందర్లోనే పూర్తవుతుందన్నారు. తెల్లాపూర్ పేరును తెలంగాణపురంగా మార్చడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోస్టల్అధికారి మురళీ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, బీజేపీ మున్సిపల్అధ్యక్షుడు రాంబాబు, మాజీ కౌన్సిలర్ శంషాబాద్రాజు, పీఏసీఎస్చైర్మన్బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.