శివ్వంపేట, వెలుగు : మండలంలోని పిలుట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ రవి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆదివారం ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల కోసం సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు.
సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం, యాదవ సంఘం భవనానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో నర్సాపూర్మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీయాదవ్, నాయకులు రమేశ్ గౌడ్, మల్లేశ్ గౌడ్, రాజేందర్ యాదవ్, రమణరావు, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, అశోక్, సుదర్శన్, శ్రీధర్ పాల్గొన్నారు.