
రామచంద్రాపురం, వెలుగు: బీహెచ్ఈఎల్జంక్షన్లో ట్రాఫిక్ను నియంత్రణకు వీలుగా కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పనులు పూర్తి దశకు చేరుకోవడంతో ఎంపీ రఘునందన్రావు శుక్రవారం అధికారులతో కలిసి సందర్శించారు. బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో త్వరలో కేంద్ర మంత్రితో ప్రారంభోత్సవం ఉంటుందని అధికారులతో చెప్పారు. ఈ బ్రిడ్జితో బీహెచ్ఈఎల్ సర్కిల్లో ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందన్నారు.
అమీన్పూర్ మున్సిపాలిటీకి వెళ్లే రోడ్డును వెడల్పు చేయడంతో పాటు ముఖ ద్వారం నిర్మించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, అమీన్పూర్మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.