నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని రైల్వే అధికారులను ఎంపీ రఘునందన్ రావు కోరారు. గురువారం ( అక్టోబర్ 24) సికింద్రాబాద్ లోని రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కావ్య, రైల్వే అధికారులు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలని కోరామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే 500 ఎకరాల భూమిని సేకరించామన్నారు. దీంతో పాటు కొల్లూరు, ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే బ్రిడ్జిని అభివృద్ది చేయాల్నారు. 

మెదక్ నియోజకవర్గంలో అజంతా, రాయలసీమ ఎక్స్ ప్రెస్ లకు హాల్టింగ్ పెంచాలని కోరారు. మరోవైపు మనోహరాబాద్ , కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేయాలని విజ్ణప్తి చేశారు.