టీటీడీ నిధులను గుళ్ల రిపేర్లకు ఖర్చు చేయండి : రఘునందన్ రావు

టీటీడీ నిధులను గుళ్ల రిపేర్లకు ఖర్చు చేయండి :  రఘునందన్ రావు
  • తెలంగాణ సీఎం, టీటీడీ చైర్మన్ ను కోరుతున్నా:  రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు: టీటీడీకి వస్తున్న ఆదాయాన్ని తెలంగాణలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని గుళ్లకు ఖర్చు చేయాలని ఎంపీ రఘనందన్ రావు కోరారు. ఎన్నో పురాతన టెంపుల్స్ రిపేర్లకు నిధుల కొరత ఉందని, వాటికి టీటీడీ నుంచి నిధులు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత రఘనందన్ రావు మీడియాతో మాట్లాడారు.

 రోడ్ల అభివృద్ధి, మున్సిపాలిటీలు, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చెయెద్దని ఆయన కోరారు. ఇటీవల తిరుమలకు వచ్చినపుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అంగీకరించాలని కోరారని, లెటర్లు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు రఘనందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు ఆమోదించినందుకు అన్ని పార్టీలకు రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు.