నరేంద్ర మోదీ కలలు నెరవేర్చాలి : ఎంపీ రఘునందన్ రావు

నరేంద్ర మోదీ కలలు నెరవేర్చాలి : ఎంపీ రఘునందన్ రావు

కౌడిపల్లి, వెలుగు: స్టూడెంట్స్​బాగా చదివి పీఎం నరేంద్ర మోదీ కన్న కలలు నేరవేర్చాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం కౌడిపల్లి మండలం కంచన్ పల్లికి చెందిన పట్లూరి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులైన పట్లూరి బాలకిషన్ రావు, నిమ్మాద్రి రావు, తిరుపతిరావు స్కూల్​లో మౌలిక వసతుల కల్పనకు రూ..60 లక్షలు సాయంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ..  2047 వరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందని అప్పటివరకు దేశం విశ్వ గురువు అవుతుందన్నారు. స్టూడెంట్స్​తమకు నచ్చిన రంగంలో రాణించి స్కూల్​, గ్రామానికి మంచి పేరు తీసుకువస్తే గుర్తింపు ఉంటుందన్నారు. 

టీచర్లు ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు మాతృభాషను గౌరవించేలా చూడాలన్నారు. తాము చదువుకున్న స్కూల్​కు, గ్రామానికి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన పట్లూరి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులను ఎంపీ అభినందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయుకులు మురళీ యాదవ్, రాజేందర్, రాకేశ్, అశోక్, డీఈవో రాధా కిషన్, ఎంఈవో బాలరాజ్​ పాల్గొన్నారు.