రాష్ట్రంలో బీజేపీ లేదనడం రేవంత్​ మూర్ఖత్వమే : ఎంపీ రఘునందన్ ​రావు

రాష్ట్రంలో బీజేపీ లేదనడం రేవంత్​ మూర్ఖత్వమే : ఎంపీ రఘునందన్ ​రావు
  • కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎ స్ తీరు సిగ్గుచేటు

మెదక్​టౌన్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మెదక్​ఎంపీ రఘునందన్​రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్​ టౌన్ లో ఇటీవల ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డికి ఆత్మీయ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ దినదినాభివృద్ధి చెందుతుందని, దీనికి ఇటీవల 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2  ఎమ్మెల్సీలు గెలుచుకోవడమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో వచ్చే మూడున్నరేండ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.  పదేండ్ల పాలనలో ప్రభుత్వ స్థలాలు అమ్మినోళ్లు, ఇప్పుడు భూములు ఎలా అమ్ముతారని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.  

మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్​కు వేలాది ఎకరాల పేదల భూములు లాక్కున్నది బీఆర్ఎస్ నే అని  ఆరోపించారు.   కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్​ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారా అని కేటీఆర్, కేసీఆర్​మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అప్పులు తీసుకున్నామనే విషయాన్ని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు.  సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్​ రాధా మల్లేశ్​ గౌడ్​, జిల్లా నేతలు గడ్డం శ్రీనివాస్​, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.