కార్పొరేట్ విద్యా మోజులో పడొద్దు : ఎంపీ రఘునందన్​రావు

కార్పొరేట్ విద్యా మోజులో పడొద్దు : ఎంపీ రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : విద్యార్థులు కార్పొరేట్ విద్యా మోజులో పడి మోసపోవద్దని, ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంపీ రఘునందన్​రావు అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో సంకల్ఫ్​సేవా ఫౌండేషన్, ఎస్​ఆర్​కే ట్రస్ట్​ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు.

ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. స్వామివివేకానంద చెప్పినట్లుగా దేశ భవిష్యత్​ తరగతి గోడల మధ్య నిర్ణయించబడుతుందన్నారు. వివేకానంద అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని చెప్పారు. బలవంతపు చదువులు కాకుండా ఏకాగ్రతతో చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అత్యంత చిన్న వయస్సులోనే సాంఘిక సంక్షేమ హాస్టల్​లో ఎవరెస్ట్​శిఖరాన్ని అధిరోహించిన ములావత్ పూర్ణను విద్యార్థులు ఆదర్శంగా సూచించారు. తల్లిదండ్రులు, గురువులను ప్రతిఒక్కరూ గౌరవించాలని తెలిపారు.