జీహెచ్ఎంసీకి ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్

జీహెచ్ఎంసీకి ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్

సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్ గా మార్చాలని చూస్తున్నారని బీజేపీ  ఎంపీ రఘునందన్ రావు అన్నారు.   శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్ లో రోజుకి వంద లారీల చెత్త పోసేందుకు GHMC ప్లాన్ చేస్తుందని విమర్శించారు. నలవల్లిలో చెత్త శుద్ధి పనులు ఆపకుంటే అధికారులకు భౌతిక దాడులు తప్పవని జీహెచ్ఎంసీకి వార్నింగ్ ఇచ్చారు.

  హైదరాబాద్, రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు పఠాన్ చెరువు మీద పడ్డారా?. అని ప్రశ్నించారు. పట్నం చెత్తను పల్లెలో వేస్తానంటే ఊరుకోబోమని హెచ్చరించారు.  దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పటాన్  చెరువు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితం అయ్యిందన్నారు.
 
హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మాట్లాడిన రఘునందన్ రావు.. 2015 లో అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని రెవిన్యూ అధికారులు చెప్తున్నారు.  .  అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి..  పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదు. దీన్ని ఉపసంహరించుకోకుంటే  నిరసనకు దిగుతాం.  పోలీసులతో ప్రజలను బయటపెట్టి పనులు చేపట్టడం సరికాదు .  పోలీస్ పహారాలో వేస్తున్న రోడ్లను.. చేస్తున్న పనులను వెంటనే ఆపాలి.  లేదంటే ఇక్కడి నుంచి నేరుగా అక్కడికి బయల్దేరుతామని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.