
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి దంసలాపురం దగ్గర గేట్ నెంబర్106 అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. స్థానిక రైతులు పరిసర గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అరుణ్‌కుమార్ జైన్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.
స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ సంబంధిత చీఫ్ ఇంజనీర్ తదితర అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. డోర్నకల్ -మిర్యాలగూడెం, డోర్నకల్--గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చి డోర్నకల్-వెన్నారం మరిపెడ మోతే ద్వారా వెళ్లడానికి ఇంతకుముందు ప్రతిపాదించిన పనులపై చర్చించారు. గతంలో రద్దు చేసిన రైళ్లను పున:రుద్దరించాలని ఖమ్మం, బోనకల్, ఎర్రుపాలెం, డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు వెళ్లే మార్గంలో గాంధీనగర్ స్టేషన్ లో రైళ్లను నిలుపుదల చేయాలని రైల్వే జీఎంని కోరారు.