గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : రఘురాంరెడ్డి

 గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : రఘురాంరెడ్డి
  • ఎంపీ రఘురాంరెడ్డి

తల్లాడ, వెలుగు : గిరిజన గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఏన్కూరు మండలం మేడేపల్లి పెద్దవాగుపై రూ4.5 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ వంతెనకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని స్టూడెంట్స్ తో కలిసి తిన్నారు. వారి సమస్యలు, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందని, సీఎం  రేవంత్ రెడ్డి పేద ప్రజల పక్షపాతి అని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్సార్ కన్స్ట్రక్షన్ చైర్మన్, మొగిలి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్​ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.